![]() |
.webp)
సర్కార్ లో విష్ణు ప్రియా కో-హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన వాళ్లంతా విష్ణుప్రియను తెగ మెచ్చేసుకున్నారు. ఈ షోకి అవినాష్, రాఘవ, రాంప్రసాద్, రోహిణి వచ్చారు. ఇక రాగానే అవినాష్ విష్ణుప్రియను తెగ పొగిడేసాడు. "సర్కార్ అంటే విష్ణు విష్ణు అంటే సర్కార్. నేను పడుకుంటే విష్ణు లేస్తే విష్ణు ఇన్ని సీజన్స్ వేరు ఈ సీజన్ వేరు విష్ణు. యు ఆర్ బ్యూటిఫుల్ యు ఆర్ ఏంజెల్ అంటూ దిష్టి తీసాడు " అవినాష్. తర్వాత రాఘవ వచ్చాడు. "ఐనా నేను వచ్చింది అందం విష్ణు ప్రియా గురించి అసలు ఆ అందం ఏంటండీ. అందం అంటే ఇది"అన్నాడు.
ఏంటి మీరు ఇంత ఫిట్ గా కనిపిస్తున్నారు జిమ్ కి వెళ్తున్నారా " అంది విష్ణు . "వెళ్లడం ఏంటండీ అసలు బయటకు వస్తే కదా " అన్నాడు రాఘవ. "పదండి సీట్ వరకు నేను తీసుకెళ్తాను " అంది విష్ణు. "మీరు తీసుకెళ్తానంటే అక్కడికేంటి అంటార్టికా కన్నా వస్తాను " అన్నాడు.
ఇక రాంప్రసాద్ వచ్చి "సుధీర్ లేకపోయినా సర్కార్ సీజన్ మొత్తం నిన్ను పెట్టి నడిపించేయొచ్చు...ఐనా జోక్ వేస్తె నవ్వడేంటి...నాకు నచ్చిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి కానీ అవి చూడలేదు.సుధీర్ నువ్వు నేను శీను ముగ్గురం ఫ్రెండ్స్ కానీ నా సపోర్ట్ మాత్రం విష్ణుప్రియకే " అంటూ తెగ కౌంటర్లు వేసి నవ్వించాడు.
![]() |